క్రైమ్/లీగల్

ఉరే సరి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: పదేళ్ల బాలికపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆమెను, ఏడేళ్ల తమ్ముడిని క్రూరంగా హతమార్చిన నిందితుడిని ఉరికంబం ఎక్కించాలని ట్రయల్ కోర్టు, తరువాత మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. తమిళనాడు కోయంబత్తూరులో 2010లో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడడంతో పాటు ఇద్దరు చిన్నారుల చేతులు కట్టివేసి కెనాల్‌లోకి తోసివేయడం హేయమయిన నేరంగా సుప్రీం ధర్మాసనం అభివర్ణించింది. నిందితుడు మనోహరన్‌కు ఉరిశిక్ష వేయడాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్‌ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం 2:1 మెజారిటీతో సమర్థించింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెనె్సస్ (పోస్కో) చట్టం, 2012కు పార్లమెంటు జూలై 24న చేసిన సవరణను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించే నిబంధనలను ఈ చట్టంలో పొందు పరచడాన్ని గుర్తు చేసింది. న్యాయమూర్తులు నారిమన్, సూర్యకాంత్, సంజీవ్ ఖన్నా ముగ్గురు కూడా కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, హత్యకు పాల్పడిన ముద్దాయికి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సమర్థించారు. అయితే, జస్టిస్ ఖన్నా దోషికి మరణశిక్షకు బదులుగా ఎలాంటి సడలింపులు లేకుండా జీవితమంతా జైలుశిక్షను విధిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.