క్రైమ్/లీగల్

సబ్ రిజిస్ట్రార్ పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఆగస్టు 1: ఫరూక్‌నగర్ సబ్ రిజిస్త్రార్ కార్యాలయంలో ఫోర్టరీ రిజిస్ట్రేషను జరిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు సబ్ రిజిస్ట్రారుతో పాటు మరొకరిపై కేసు నమోదు చేసినట్లు షాద్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీ్ధర్ కుమార్ వెల్లడించారు. షాద్‌నగర్ పట్టణం చటాన్‌పల్లి వద్ద ఉన్న ఒక ప్లాటుకు సంబంధించి ఫోర్జరీ రిజిస్ట్రేషను జరిగిందని, తన ప్లాటును నిబంధనలకు విరుద్ధంగా వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసారని బాధితుడు రాఘవ రావు ఫిర్యాదు చేశారు. ఫరూక్‌నగర్ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు శ్రీనివాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ వివరించారు. ఫోర్జరీ కేసులో సబ్ రిజిస్ట్రార్‌పై కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. కుర్చీ ఖాళీగా కనిపించింది.