క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన దేవాదాయశాఖ అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఆగస్టు 1: ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కర్నూలు జిల్లా గూడూరు గ్రూపు దేవాలయాల ఎగ్జిక్యూటివ్ అధికారి పీ.రాంప్రసాద్‌ను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఆదోనిలో నివాసముంటున్న రాంప్రసాద్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు సుమారు రూ.2.5 కోట్ల మేరకు అక్రమ ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని పలు దేవాలయాల్లో ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేసిన రాంప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు అందడంతో గురువారం ఉదయం దాడులు జరిపినట్లు డీఎస్పీ తెలిపారు. ఆదోనిలోని రాంప్రసాద్ ఇంటితోపాటు ఆయన తల్లిదండ్రులు, అత్తమామలు, భావమర్ది ఇండ్లపై ఏకకాలంలో దాడులు జరిపినట్లు తెలిపారు. ఈదాడుల్లో రూ. 2.5 కోట్ల మేరకు అక్రమాస్తులు గుర్తించామన్నారు. ఆదోనిలో రెండు ఇళ్లు, కర్నూలులో ఒక ఇళ్లు రాంప్రసాద్ పేర ఉన్నాయని, అతని భార్య పేర 23 ఇళ్లస్థలాలు, ఇద్దరు కూతుర్ల పేర రెండు ఇళ్లస్థలాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. రూ.4 నాలుగు లక్షల నగదు, 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటితోపాటు రూ.15.5 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లు, రూ. 28.5 ప్రామిసరీ నోట్లు దొరికినట్లు తెలిపారు. అలాగే బ్యాంకులో ఉన్న లాకర్లులో రూ.లక్ష నగదు, 50 గ్రాముల బంగారం లభించినట్లు తెలిపారు. రాంప్రసాద్ గతంలో ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయం ఎగ్జిక్యూటివ్ అధికారిగా, ఆదోని గ్రూప్ దేవాలయాల అధికారిగా పని చేశారు. ఇటీవల గూడూరు గ్రూప్ టెంపుల్స్ అధికారిగా బదిలీ అయ్యారు. రాంప్రసాద్‌ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ నాగభూషణం తెలిపారు.
చిత్రం... రాంప్రసాద్ ఇంట్లో లభించిన నగదు, బంగారు నగలు