క్రైమ్/లీగల్

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై హైకోర్టులో మరో రెండు పిటిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 1: రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏలు) నిలిపివేతపై హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే 42 విద్యుత్ పంపిణీ సంస్ధలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే బాటలో తాజాగా పిటిషన్లు దాఖలు చేసిన కంపెనీలు వైఎస్ జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా తమ వాదన చెబుతూ సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లను ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించాయి. తాజాగా టాటా రెన్యువబుల్, వాల్ వాహన్ సంస్థలు వేసిన పిటిషన్లు హైకోర్టు ముందుకు విచారణకు వచ్చాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే దాఖలైన పిటిషన్లపై ఈనెల 22వ తేదీన విచారణ ఉన్నందున వీటిపైన కూడా అదే రోజు విచారణ చేపట్టాలని ప్రభుత్వ తరుఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదన విన్న న్యాయస్థానం విచారణను 22కి వాయిదా వేసింది. పీపీఏలపై దాఖలైన అన్ని పిటిషన్లను ఆ రోజు హైకోర్టు విచారించనుంది. పీపీఏలపై ఇప్పటి వరకు 42 విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలపై సమీక్షించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విద్యుత్ సంస్ధలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.