క్రైమ్/లీగల్

ఖాళీ పేపర్లు నింపాలంటూ ఘరానా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, ఆగస్టు 1: నిరుద్యోగ యువతీ, యువకుల బలహీనతలను ఆసరాగా చేసుకొని 90 ఖాళీ పేపర్లను నింపితే పదివేల వరకు డబ్బులు ఇస్తామని నమ్మించి వంచించిన మోసగాడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్టు వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్‌జీ గురువారం తెలిపారు. ముల్కనూరు గ్రామంలో గత పక్షం రోజులుగా వర్క్ ఫర్ ఆల్ బోగస్ సంస్థ తన కార్య క్రమాలను నిర్వహిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తోంది. ఎర్రవెల్లి గ్రామానికి చెందిన ముత్తోజు అజయ్ అనే యువకుడు ఖాళీ పేపర్లు నెంబర్లతో ఉన్నవి నింపాలని తెలిపాడు. ముందుగా తనకు 2600 రూపాయిలు చెల్లిస్తే 90 పేపర్లు నింపిన తర్వాత ఇస్తే 8 వేల రూపాయలు ఇస్తామని ప్రసార మాధ్యమాల ద్వారా పబిసిటీ ఇచ్చాడు. దీంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుండి సుమారు వేయికి పైగా విద్యార్ధులు వర్క్ఫర్ ఆల్‌కు లక్షల్లో డిపాజిట్ చేశారు. అనంతరం నెంబర్లతో కూడిన పత్రాలు ఇచ్చిన తర్వాత నిర్వాహుకుడు షాపు తీయకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
సుమారు 300మందికి పైగా నిరుద్యోగుల నుంచి నిర్వాహకుడు డబ్బులు వసూలు చేసినట్టు సీఐ తెలిపారు. విద్యార్థుల నుండ లక్షల్లో డబ్బు తీసుకొని మోసం చేసిన సంఘటనలో హైదరాబాద్ స్థ్ధాయిలో నిందితులు ఉన్నారని, త్వరలో పట్టుకొని విద్యార్థులకు న్యాయం చేస్తామని అన్నారు. సమావేశంలో ముల్కనూరు ఎస్సై టీవీ ఆర్ సూరి పాల్గొన్నారు.