క్రైమ్/లీగల్

చంద్రబాబు భద్రతపై ముగిసిన వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 1: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు భద్రత కుదింపు పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును న్యాయస్ధానం రిజర్వులో ఉంచింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రముఖుల భద్రతపై సమీక్షించింది. అందులో భాగంగానే చంద్రబాబు, లోకేష్ సహా వారి కుటుంబ సభ్యుల భద్రతపై కోత విధించింది. అయితే చంద్రబాబుకు భద్రత తగ్గించడంపై టీడీపీ నేతలు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు ఉన్న భద్రతను యథాతథంగా ఉంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎక్కడెక్కడ ఎంతెంత ఏ స్ధాయి అధికారులు భద్రత కల్పిస్తున్నారో వివరాలు కోర్టుకు అందించారు. ప్రస్తుతం చంద్రబాబుకు సెక్యూరిటీగా 74మంది ఉంటున్నారని వివరించారు. హైదరాబాద్‌లో నివాసానికి కూడా భద్రత కల్పిస్తున్నామని కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువే సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పారు. మరోవైపు చంద్రబాబుకు మావోయిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ప్రాణహాని ఉందని, భద్రత పెంచాలని వాదించారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్ధానం తీర్పును రిజర్వులో ఉంచింది.