క్రైమ్/లీగల్

లింగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: ఎన్‌కౌంటర్‌లో హతమైన ఆదివాసీ నేత పున్నం లింగయ్య మృతదేహానికి రీ పోస్టుమార్టం జరపాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పోస్టుమార్టం నివేదికను సీల్డు కవర్‌లో శుక్రవారం నాడు సమర్పించాలని పేర్కొంది. మెడికల్ బోర్డు , సీనియర్ అధికారులకు ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్ కౌంటర్‌పై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను, స్టేషన్ ఆఫీసర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని గడ్డం లక్ష్మణ్ ప్రతివాదులుగా చేర్చారు. లింగయ్యను హతమార్చిన పోలీసులపై సెక్షన్ 302 కింద కేసు నమోదుచేయాల్సిన పోలీసులు తిరిగి లింగయ్య కుటుంబ సభ్యులపైనే ఐపీసీ 307 కింద కేసులు నమోదుచేశారని ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున వీ రఘునాధ్ వాదనలు వినిపించారు. లింగయ్య ఎన్‌కౌంటర్‌పై సిట్‌ను వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటిషన్‌లో లక్ష్మణ్ కోరారు. నకిలీ ఎన్‌కౌంటర్‌గా అనుమానాలు వ్యక్తమవుతున్నందున, పోస్టుమార్టంను మరో మారు గాంధీ ఆస్పత్రి మెడికల్ బోర్డు ద్వారా నిర్వహించాలని పిటిషనర్ కోరారు. అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందర్‌రావు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ హతుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అన్నారు. ఎన్‌కౌంటర్ తెలంగాణ పరిధిలో జరగలేదని, చత్తీస్‌ఘడ్ ప్రాంతంలో జరిగిందని ఏఏజీ చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం 2వ తేదీ ఉదయం నాటికి గాంధీ ఆస్పత్రిలో లింగయ్య మృతదేహాన్ని అప్పగించాలని పేర్కొంది. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంటనే మెడికల్ బోర్డును నియమించాలని, బోర్డు 2వ తేదీ సాయంత్రం ఆరు గంటలకల్లా రీ పోస్టుమార్టంతో పాటు రీ ఆటోప్సి కూడా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. పోస్టు మార్టం నివేదికతో పాటు మిగిలిన వివరాలను 5వ తేదీన కోర్టు ముందుంచాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణ 5వ తేదీన చేపట్టనున్నారు.