క్రైమ్/లీగల్

ఉన్నావో బాధితురాలికి రక్షణ కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఆగస్టు 2: ఉన్నావో రేప్ కేసులో సుప్రీం కోర్టు తాజా తీర్పును మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ శుక్రవారం పేర్కొన్నారు. ఉన్నావో బాధితురాలిని ‘మధ్యప్రదేశ్ పుత్రిక’గా భావిస్తున్నామని సీఎం అన్నారు. ఉన్నావో రేప్ కేసులో లక్నోలో దాఖలైన కేసులన్నింటినీ కింది కోర్టులు ఢిల్లీకి బదలాయించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే. పైగా రోజువారీ ప్రాతిపదికన మొత్తం 45 రోజుల్లో కేసును పరిష్కరించాలని సుప్రీం ఆదేశించింది. ‘ఉన్నావో బాధితురాలికి సంబంధించి సుప్రీం ఇచ్చిన ఆదేశాలను ఎంపీ ప్రభుత్వం స్వాగతిస్తోంది.. బాధితురాలు, ఆమె బంధువులు ఉత్తరప్రదేశ్‌లో తమకు రక్షణ లేదని భావిస్తూ.. మధ్యప్రదేశ్‌లో ఉండడానికి ఇష్టపడుతున్నారు.. దీనిని కూడా మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం.. ఇక్కడ వారి కుటుంబానికి అవసరమైన పూర్తి రక్షణ బాధ్యతలను మా ప్రభుత్వం తీసుకొంటుంది’ అని కమల్‌నాథ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘బాధితురాలికి మెరుగైన వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకొంటామనీ, నాణ్యమైన విద్యను కూడా అందిస్తామనీ.. ఆమెకు ఎటువంటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకొంటామని’ కమల్‌నాథ్ స్పష్టం చేశారు. కోర్టు విచారణల నిమిత్తం ఢిల్లీకి తరచు వెళ్లిరావడానికి అవసరమైన ఖర్చులను కూడా తమ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.