క్రైమ్/లీగల్

తలాక్ బిల్లు పాసైన గంటల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మథుర, ఆగస్టు 2: ట్రిపుల్ తలాఖ్‌కు అడ్డుకట్ట వేస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించడం, దానికి రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర పడి 24 గంటలు గడవక ముందే ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. దీంతో మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధిస్తూ కేంద్రం చట్టం చేసిన తర్వాత ఇదే మొదటి కేసు అని చెప్పవచ్చు. కొత్త చట్టం ప్రకారం ముస్లిం భర్త తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పినట్లయితే మూడేళ్ళ శిక్ష పడుతుంది. ముస్లిలం మహిళలకు రక్షణ కల్పించేందుకు కేంద్రం ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇటీవల ఫలించిన సంగతి తెలిసిందే. గత నెల 25న లోక్‌సభ, 30న రాజ్యసభ ట్రిపుల్ తలాఖ్ బిల్లును ఆమోదించింది. ఉభయ సభలు ఆమోదించిన బిల్లుకు ఈ నెల 1న (గురువారం) రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఇలాఉండగా హర్యానాలోని నుహ జిల్లాకు చెందిన ఇక్రం రెండేళ్ళ క్రితం కృష్ణా నగర్, కోసి కలాన్ పట్టణ నివాసి జుమిరాత్‌ను వివాహం చేసుకున్నాడు. నాటి నుంచి కూడా తన భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. పుట్టింటికి వెళ్ళి లక్ష రూపాయలు తీసుకుని రావాల్సిందిగా పదేపదే భార్యను పంపించేవాడు. దీంతో విసిగిపోయిన భార్య సమీపంలోని మహిళా పోలీసు స్టేషన్లొ ఫిర్యాదు చేసింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇక్రంకు నచ్చజెప్పి పంపించడం జరిగింది. భార్య-్భర్తలిద్దరికీ తాను కౌన్సిలింగ్ ఇచ్చి పంపించానని మహిళా పోలీసు స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ రుచి త్యాగి తెలిపారు. జూలై 30 వారిరువురు పోలీసు స్టేషన్ మెట్లు దిగగానే అక్కడే ఉన్న అత్తను లక్ష రూపాయలు కట్నంగా ఇవ్వాలని అడిగాడు. అందుకు అత్త నిరాకరించడంతో భార్యకు ఇక్రం మూడు సార్లు తలాఖ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. దీంతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.