క్రైమ్/లీగల్

మధ్యవర్తిత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసును వివాదాలను పరిష్కరించి, ఏకాభిప్రాయానికి వచ్చేందుకు ఏర్పడిన మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సయోధ్య కుదరకపోవడంతో, ఈనెల 6నుంచి ఈ కేసుకు సంబంధించిన వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఏ నజీర్ సభ్యులుగా ఉన్న సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎఫ్‌ఎంఐ కలీఫుల్లా నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీని రామజన్మభూమి కేసులో వాది, ప్రదివాదులతో చర్చలు జరిపి, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుకొనేందుకు సుప్రీం కోర్టు ఈ ఏడాది మార్చి 8న నియమించింది. ఈ ప్యానెల్‌లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ న్యాయవాది శ్రీరాం పంచును సభ్యులుగా చేర్చింది. ఇరు వర్గాల పెద్దలు, ప్రముఖులతో ఆంతరంగిక చర్చలు జరిపి, ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే, సరైన పురోగవృద్ధి లేకపోవడంతో, కమిటీని రద్దు చేసి సుప్రీం కోర్టు నేరుగా విచారణ జరిపించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. జూలై 11న ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందిస్తూ, వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని మధ్యవర్తిత్వ కమిటీని ఆదేశించింది. అనంతరం, 21వ తేదీలోగా చర్చలు ముగించాలని, ఈనెల 1వ తేదీన నివేదిక ఇవ్వాలని స్పష్టం చేస్తూ, మరో మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. కోర్టు ఆదేశం మేరకు కమిటీ గురువారం నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించింది. దీనిని పరిశీలించిన తర్వాత, ఈ కేసులో కమిటీ ఒక నిర్ణయానికి రావడంలో విఫలమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాబట్టి, ఈనెల 6 నుంచి ప్రతి రోజూ వాదనలు వింటామని ప్రకటించింది. రామజన్మభూమి స్థల వివాదంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, 2010లో 14 అప్పీళ్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. అయోధ్యలోని 2.77 ఎకరాల స్థలంలో రామ మందిరం నిర్మించాలని ఒక వర్గం డిమాండ్ చేస్తుంటే, అక్కడ ఉన్న బాబ్రీ మసీదును కూల్చేశారు కాబట్టి, మళ్లీ తమ ప్రార్థనా మందిరమే కట్టాలని మరో వర్గం పట్టుబడుతున్నది. కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు ఈ స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రాం లాలా సంస్థలకు సమానంగా పంచాలని తీర్పునిచ్చింది. అయితే, దీనిని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలుకాగా, ప్రస్తుతం నాలుగు సివిల్ సూట్స్ విచారణలో ఉన్నాయి. 16వ దశాబ్దంలో షియా వర్గానికి చెందిన మీర్ బాకీ నిర్మించిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న హిందూ కరసేవకులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ప్రతి రోజూ వాదనలు వినాలని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ణయించడంతో, అప్పటి నుంచి వివిధ కోర్టుల్లో నలుగుతున్న ఈ వివాదానికి త్వరలోనే పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.