క్రైమ్/లీగల్

ముగిసిన లింగన్న రీపోస్టుమార్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: భద్రాద్రి కొత్తగుడెం జిల్లా గుండాల మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన న్యూ డెమోక్రసీ సభ్యుడు లింగన్న మృతదేహానికి వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు. జూలై 31వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన లింగన్న మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున నలుగు గంటలకు కొత్తగూడెం నుంచి నగరంలోని గాంధీ అసుపత్రికి తీసుకువచ్చారు. ఆయన మృతదేహానికి ముగ్గురు వైద్యుల బృందం హైకోర్టు ఆదేశాల మేరకు రీపోస్టుమార్టం నిర్వహించారు. లింగన్న మృతదేహానికి శవపరీక్ష దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగర పోలీసులు గాంధీ అసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే శవపరీక్ష వద్దకు అనుమతించారు. అను నిత్యం ప్రజల సమస్యలు, హక్కుల కోసం పోరాడిన వ్యక్తిని పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేసి అన్యాయంగా హతమార్చారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లింగన్న కుటుంబీకులకు మద్దతుగా ఆసుపత్రి వద్దకు వచ్చిన ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, ముగ్గురు సభ్యుల వైద్య బృందం రీపోస్టుమార్టం నిర్వహించారు. రీపోస్టుమార్టం నివేదికను ఈనెల 5వ తేదీన హైకోర్టుకు సమర్పిస్తారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రీ పోస్టుమార్టం నేపథ్యంలో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఆసుపత్రికి వచ్చిపోయోవారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు: సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

లింగన్న ఎన్‌కౌంటర్ అనేక అనుమానాలకు, సందేహాలకు తావిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇప్పటికే హైకోర్టు రీ పోస్టుమార్టం కోసం ఆదేశాలు ఇచ్చిందని, గిరిజన ప్రజలు తిరగబడిన తీరు చూస్తే పోలీసులు కాల్చి చంపిన ఘటన అనే ఆరోపణలకు బలం చేకూరుతోందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్ కౌంటర్‌పై ప్రభుత్వం స్పందించి న్యాయవిచారణ చేపట్టాలని అన్నారు. తెంలగాణ రాష్ట్రంలో ఇక నుండి బూటకపు ఎన్‌కౌంటర్‌లు జరగవని రాష్ట్రం ఏర్పడిన కొత్తలో చెప్పిన ప్రభుత్వం కొద్దిరోజుల్లోనే శృతి, విద్యాసాగర్‌లాంటి వారిని ఎన్‌కౌంటర్ చేసిందని, మొత్తం ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలని అన్నారు.