క్రైమ్/లీగల్

బైక్ దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, ఆగస్టు 3: పట్టణంలోని సీతయ్య హోటల్ బయట పార్క్ చేసి టిఫిన్ చేసేందుకు వెళ్లగా బైక్ పోయిన సంఘటనతో మోటారు సైకిళ్ళ దొంగను పట్టుకుని 17 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని గుడివాడ డీఎస్పీ ఎన్ సత్యానందం తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న బైక్‌లను, దొంగలను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అనంతరం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ హోటల్లో టిఫిన్ చేయడానికి వెళ్లిన బైక్ ఏపీ 37 సీజె 1446 నెంబరు గల మోటారు సైకిల్ చోరీకి గురైందని వచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్‌ఐ కె రాజారెడ్డి వెంటనే స్పందించి కైకలూరు నుండి కలిదిండి వైపు వెళుతున్న గురువెల్లి తిరుపతిరావు దొంగతనం చేసి బైక్‌ను తీసుకువెళుతుంటే పట్టుకున్నారని తెలిపారు. తిరుపతిరావును విచారించగా శుక్రవారంతో దొంగతనం చేసిన బైక్‌తో పాటు మరో 16 బైక్‌లు దొంగతనం చేసినట్లు చెప్పడంతో ముదినేపల్లి మండలం బొమ్మినంపాడుకు చెందిన సత్యనారాయణ దగ్గర తొమ్మిది బైక్‌లు, పెడన మండలం చెన్నూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు దగ్గర ఐడు బైక్‌లు ఉన్నాయని చెప్పడంతో ఎస్‌ఐ సిబ్బందితో వెళ్ళి మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముగ్గురిని కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరుస్తామని తెలిపారు. ఎస్‌ఐతో పాటు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ కెఎన్‌వి జయకుమార్, ట్రైనింగ్ ఎస్‌ఐ కెఎన్‌ఎల్ గాయత్రి, సిబ్బంది పాల్గొన్నారు.