క్రైమ్/లీగల్

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 3: మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల ముగింపు రోజున పోలీసులు భారీ ఎన్‌కౌంటర్ చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా సీతాగోట అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న రిజర్వు పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. వారోత్సవాల్లో మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడతారనే సమాచారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీతాగోట్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పులు సుమారు మూడున్నర గంటల పాటు సాగినట్లు సమాచారం. ఘటనా స్థలంలో భారీగా పేలుడు సామగ్రిని, ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏకే-47, 303రైఫిల్స్, 12బోర్‌గన్స్, సింగిల్ షాట్ రైఫిల్స్ వంటి ఆయుధాలు కూడా లభ్యమైనట్లు చత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్తి తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహదుల్లో కూడా కాల్పులు జరుగుతున్నట్లు ఆయన శనివారం సాయంత్రం తెలిపారు. మావోయిస్టు మృతదేహాలను ప్రత్యేక వాహనాల ద్వారా సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితిని పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా సమీక్షిస్తుండటం గమనార్హం.
చిత్రం... మావోల మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం