క్రైమ్/లీగల్

మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం) : అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మరో 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ తవ్వకాలపై 2014లో గురవాచారి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యరపతినేని శ్రీనివాసరావు తనపై కక్ష గట్టి బెదిరింపులకు పాల్పడ్డారని, తనపై కోపంతో తనపై దాడి చేసి కాళ్ళు, చేతులు విరిగేలా కొట్టించారంటూ గురవాచారి తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవటంతో హైకోర్టును ఆశ్రయించాడు. మైనింగ్ అధికారులు, పోలీసులు అందరూ యరపతినేనికే సహకరిచారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుని ఫిర్యాదుపై విచారణ జరిపిన హైకోర్టు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో యరపతినేని శ్రీనివాసరావుతోపాటు మైనింగ్ ఏడీ జగన్నాధరావు, ఆర్డీఓ మురళి, సీఐ హనుమంతరావులతోపాటు రెవిన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు మొత్తం 12మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.