క్రైమ్/లీగల్

కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఆగస్టు 3: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయిని కిడ్నాప్ చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద రూ.47 వేల క్యాష్, కారు, సిల్వర్, గోల్డ్ రింగ్‌లు, నాలుగు సెల్‌ఫోన్‌లు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నట్లు తయారు చేసిన నకిలీ గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 23న హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయి కిడ్నాప్ అయి వారం రోజుల తర్వాత క్షేమంగా ఇంటికీ వచ్చిన సంఘటన తెలిసిందే. శనివారం ఎల్బీనగర్ రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను సీపీ మహేష్ భగవత్ తెలిపారు. కృష్ణా జిల్లా కింకిపాడు ప్రాంతానికీ చెందిన రవిశేఖర్(48) గత నెల 23న హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యువతి వాణి(20)కి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, వారం రోజులు పాటు కిడ్నాప్ చేసి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లో సంచరించి తప్పించుకుని తిరిగాడు. హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు. వారం రోజుల తర్వాత వాణి నగరానికి వచ్చింది. క్షేమంగా ఉన్నానని, తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చింది.
రాచకొండ పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్ రవిశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు చెప్పిన వివరాలను విని పోలీసులే ఆశ్చర్యానికి లోనయ్యారు. 2001 నుంచి నేర చరిత్ర కలిగిన నిందితుడిపై తెలంగాణలో 2006 నుంచి 2017 వరకు అనేక కేసులు నమోదైనట్లు సీపీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2001 నుంచి ఇప్పటి వరకు 48 కేసులు, కర్నాటకతో పాటు మూడు రాష్ట్రాల్లో 65 కేసులు నమోదైనట్లు చెప్పారు. పలు పేర్లతో ఏసీబీ, విజిలెన్స్ విభాగాల్లో అధికారిగా చలామణి అవుతూ వ్యాపారులను బెదిరించి డబ్బు తీసుకునేవాడని పేర్కొన్నారు. మహిళలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు వచ్చాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కొంత మందిని మోసం చేశాడని వివరించారు.
కలెక్టర్ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారిగా పని చేస్తున్నానని నమ్మించి తనిఖీలకు వచ్చినట్లు చెప్పి అంగన్‌వాడీ ఉద్యోగస్థులను మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని సీపీ వివరించారు. ఆంధ్ర రాష్ట్ర పోలీసులు తమకు అన్ని విధాల సహకరించినట్లు చెప్పారు. నిందితుడు గతంలో కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్తుండగా రెండు సార్లు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయినట్లు కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. నిందితుడిని కస్టడీకి తీసుకుని అన్ని కేసులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని, కేసుల ఆధారంగా నిందితుడిపై పీడీ యాక్ట్ కేసును నమోదు చేస్తామని సీపీ వెల్లడించారు. కార్యక్రమంలో రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రిత్ సింగ్, ఏసీపీ గాంధీ నారాయణ పాల్గొన్నారు.