క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, ఆగస్టు 3: రోడ్డు దాటుతున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం సికింద్రాబాద్ నుండి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారమతిపేటకు ఆర్టీసీ బస్సు (టీఎస్08యూబీ6299) జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ (ఎంహెచ్13 ఎఎక్స్4845) ఢీకొట్టిందని తెలిపారు. సంఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు పేరెటి భాగ్యలక్ష్మి, చింతపల్లి వైష్ణవి, పేరేటి పద్మ గాయపడినట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.