క్రైమ్/లీగల్

ఉన్నావో కేసు నిందితుడ్ని ప్రశ్నించిన సీబీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 3: రెండేళ్ల క్రితం మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో అరెస్టయిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్‌ను సీబీఐ అధికారులు శనివారంనాడు సీతాపూర్ జిల్లా జైలులో ప్రశ్నించారు. కొన్ని గంటలపాటు అనేక అంశాలపై సీబీఐ త్రిసభ్య బృందం అతనిని ఉక్కిరిబిక్కిరి చేసింది. శుక్రవారం 19 సంవత్సరాల ఉన్నావో అత్యాచార బాధితురాలు, బంధువును కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. బాధితురాలిని హతమార్చేందుకు ప్రయత్నించారన్న అభియోగాలపై బీజేపీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. మరోపక్క ఈ ప్రమాదానికి సంబంధించి కూడా సీబీఐ బృందం అనేక కోణాల్లో ఆరా తీస్తోంది. గత నెల 28న బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న ట్రక్ డ్రైవర్, క్లీనర్‌ను కూడా అధికారులు ప్రశ్నించారు. ఆ ఘటనలో బాధితురాలి బంధువులిద్దరు మరణించారు. వారి లాయర్ కూడా తీవ్ర గాయాలకు గురైన విషయం తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ఎమ్మెల్యే తమను హతమార్చేందుకు ప్రయత్నించాడని బాధితురాలి బంధువులు ఆరోపించారు. ఇదిలావుండగా కారు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్, క్లీనర్‌ను రిమాండ్‌కు పంపినట్టు పోలీసులు తెలిపారు. కాగా, తీవ్ర గాయాలతో లక్నోలోని మెడికల్ యూనివర్సిటీ ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్న ఉన్నావో అత్యాచార బాధితురాలి పరిస్థితి మరింత విషమించింది. తాజాగా ఆమెకు న్యుమోనియా సోకినట్టు వైద్యులు తెలిపారు. 19 సంవత్సరాల ఈ యువతి వెంటిలేటర్‌పైనే ఉందని వారు వెల్లడించారు. న్యుమోనియా కారణంగా ఆమెకు తీవ్రంగా జ్వరం వస్తోందని, రక్తపోటును తగ్గించేందుకు మందులు ఇస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ప్రమాదమేమీ లేదని మాత్రం చెప్పలేమని ఈ ఆరోగ్య కేంద్రం ఇన్‌చార్జి సందీప్ తివారి తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితురాలి లాయర్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని వారు వెల్లడించారు. వీరిద్దరికీ అవసరమైన వైద్యం చేస్తున్నామని, నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని వారు తెలిపారు.