క్రైమ్/లీగల్

మైనర్‌పై బాలుడి అత్యాచారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఆగస్టు 3: మైనర్‌పై ఓ బాలుడు అత్యాచారం జరిపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురం పట్టణంలోని మేళాపురం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ బాలిక (9) తన అవ్వ నివాసం ఉంటున్న కోట ప్రాంతానికి గత మే 2వ తేదీ వెళ్లింది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ బాలుడు(16) ఆ బాలికను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఈ విషయాన్ని అప్పట్లో బాలిక కుటుంబసభ్యులకు చెప్పలేదు. తరచూ కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. దీంతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. దీంతో జరిగిన విషయాన్ని బాలిక కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు శనివారం హిందూపురం టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రామక్రిష్ణ తెలిపారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై ప్రత్యేకంగా విచారిస్తున్నామని ఆయన తెలిపారు.