క్రైమ్/లీగల్

పాతికేళ్లుగా 2 లక్షల కేసులు పెండింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో అపారంగా కేసులు పెండింగ్‌లో ఉండడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
గత 25 సంవత్సరాలుగా వివిధ కోర్టుల్లో రెండు లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అలాగే, 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య వెయ్యికి పైనే ఉన్నాయని ఆయన వెల్లడించారు. గౌహతిలో ఆదివారం హైకోర్టు ఆడిటోరియం నిర్మాణానికి గగోయ్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గొగోయ్ మాట్లాడుతూ కొందరు వ్యక్తుల కయ్యంకోరు, బాధ్యతారహిత ప్రవర్తన పట్ల ప్రధాన న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అవాంఛనీయ శక్తుల తాకిడి నుంచి దేశ సమున్నత సంస్థలు బయటపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే, దురుసుగా, బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్న గ్రూపులు, వ్యక్తులు ఎవరన్న అంశాన్ని ఆయన వెల్లడించలేదు. వ్యక్తులు, గ్రూపుల వ్యవహరిస్తున్న ధోరణి దురదృష్టకరం.. బలమైన దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ద్వారా ఆయా శక్తులను అధిగమించేందుకు సమున్నత సంస్థలు కృషి చేయాలన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థల్లో న్యాయస్థానాల వ్యవస్థ భిన్నమైందని పేర్కొన్నారు.
వేర్వేరు సందర్భాల్లో న్యాయస్థానాల నిర్ణయాలను గౌరవిస్తూ ముందుకు సాగడం హర్షించదగ్గ పరిణామమే కాకుండా ముఖ్యమైన అంశమని ఆయన పిలుపునిచ్చారు. న్యాయ వ్యసస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోయే విధంగా జడ్జిలు లేదా న్యాయాధికారులు వ్యవహరించకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, అస్సాంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.