క్రైమ్/లీగల్

మృత్యు ఘోష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడ్జిల్ : మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం వ్యవసాయ కూలీ పనులు ముగించుకుని ఇంటింటి వెళ్తున్న సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. మరో ఐదు నిమిషాల వ్యవధిలో కూలీలు తమ ఇళ్లకు చేరుకునే వారే. కానీ, మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ వారిని పొట్టనబెట్టుకుంది. ఆదివారం సాయంత్రం ఏడుగంటల సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారు రెడ్డిగూడ దగ్గర కూలీలు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న టీఎస్29 టి5488 నంబర్ గల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. ఘటనలో కొత్తపల్లి గ్రామం, బొంగ్యాతండాకు చెందిన 15 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. మృతులను తెలుగు శివలీల (55), వడ్డె చెన్నమ్మ (48) ముగిగుడ్డ వెంకటమ్మ (45), ఎన్. చెన్నమ్మ (47), ఎం. వెంకటమ్మ (45) లంబాడ శివాజీ (45) లంబాడా చాందీ (35), మూడావత్ బిచానీ (40), సక్రూనాయక్ (28), ఎల్లమ్మ(45), కే. బాలమణి (45), సీ. సాలమ్మ (34) లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో తెలుగు ఇంద్రమ్మ (55), తెలుగు జంగమ్మ (40), ఎరుకలి ఈదమ్మ (50) తీవ్రంగా గాయపడి ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం వాడ్యాల గ్రామంలో వ్యవసాయ
పనుల నిమిత్తం కూలీకి వెళ్లారు. వరినాట్లు వేసి తిరిగి వస్తుండగా కొత్తపల్లి గ్రామశివారు రెడ్డిగూడ కమాన్ దగ్గరకు రాగా జడ్చర్ల నుండి కల్వకుర్తి వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి, వాడ్యాల నుండి కొత్తపల్లి వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దాంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు జడ్చర్ల ఆసుప్రతికి తరలించగా అక్కడ మృతి చెందారు. ఆటోలో మొత్తం 16 మంది ప్రయాణిస్తుండగా ఆటో డ్రైవర్ సక్రూ పరిస్థితి కూడా విషమంగా ఉంది. మిగతా 15 మంది కూలీలు మృత్యువాతపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ రేమారాజేశ్వరి, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే రోడ్డుపై మృతదేహాలు పడి ఉన్నాయి. లారీ ఆటోపై నుండి వెళ్లడంతో ఆటోకింద పడి కూలీలు నుజ్జునుజ్జు అయ్యారు. శవాలు గుర్తుపట్టకుండా మారాయి. కొందరి కూలీల మృతదేహాలు కాలు చేతులు విరిగి వేర్వేరుగా పడ్డాయి. ఈ విషాద ఘటనతో బొగ్యాతండా, కొత్తపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. కాగా, ఈ ఘటన పట్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తరుచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోవడం లేదని ఇతంలో కూడా ఇక్కడే మలుపు దగ్గర ప్రమాదాలు జరిగాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోకు ప్రజలు దిగడంతో జడ్చర్ల, కల్వకుర్తికి వెళ్లే ప్రధాన రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాత్రి పొద్దుపోయే వరకు మృతదేహాలతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. మృతుల కుటుంబాలను ఆందోకోవాలంటూ డిమాండ్ చేశారు.
చిత్రాలు.. లారీ ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయిన ఆటో
*రోడ్డుపై పడ్డ కూలీల మృతదేహాలు