క్రైమ్/లీగల్

బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, ఆగస్టు 4: బంధువుల ఇంటికి వెళ్లి వచ్చెసరికి ఇంట్లో దొంగలు పడి బంగారు, వెండి అభరణాలు, నగదు దొచుకెళ్లిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్‌మెట్ సంతోష్‌నగర్‌లో నివసించే లక్ష్మీకాంత్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, శనివారం, ఆదివారం సెలవుదినం కావడంతో కూకట్‌పల్లిలో నివసించే బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లినట్టు తెలిపారు. ఆదివారం ఉదయం వారి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయన్ని ఇంటి పక్కన వారు సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి బీరువాలో దాచిన 35 తులాల బంగారు, కేజీన్నర వెండి అభరణాలు, 65 వేల రూపాయల నగదు కనిపించలేదు. వెంటనే నేరేడ్‌మెట్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.