క్రైమ్/లీగల్

‘అనంత’లో ముగ్గురు రైతుల బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెళుగుప్ప/గోరంట్ల, బత్తలపల్లి, ఆగస్టు 4 : అనంతపురం జిల్లాలో ఆదివారం ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిలో ఒకరు మహిళా రైతు ఉన్నారు. వివరాలు.. బెళుగుప్ప మండల పరిధిలోని నరసాపురం గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు (62) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. రైతు ఆంజనేయులుకు 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే గత ఐదారేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో తన పొలంలో ఆరు బోర్లు వేసినా నీరు పడలేదు. ప్రతి ఏటా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. కుటుంబ పోషణ భారం కావడంతో మనస్తాపానికి గురైన ఆంజనేయులు తన తోటలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన రైతులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అలాగే గోరంట్ల మండల పరిధిలోని ఖాజాపురం గ్రామానికి చెందిన రైతు గోపాలప్ప(52) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ జయానాయక్ తెలిపారు. కబత్తలపల్లి మండలంలోని యర్రాయపల్లి గ్రామంలో మహిళా రైతు నారమ్మ (59) ఊజీ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. బోర్లు వేసినా నీరు పడకపోవడం, అప్పులు, బ్యాంకు రుణాలు కట్టలేని పరిస్థితులు ఏర్పడటంతో జీవితంపై విరక్తి చెందిన నారమ్మ శనివారం అర్ధరాత్రి ఊజి మాత్రలు మింగడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.