క్రైమ్/లీగల్

ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టులో మంగళవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. రాజ్యాంగ ధర్మాసనం రోజువారీ విచారణ జరపనుంది. కేసు విచారణ ప్రక్రియను రికార్డు చేయాల్సిందిగా సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రోజువారీ విచారణను ప్రత్యక్ష ప్రసారం/ రికార్డింగ్‌కు ఆదేశించాలని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త కేఎన్ గోవిందాచార్య అభ్యర్థించారు. విచారణలో ఈ అంశాన్నీ చేర్చాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎస్‌కే బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్ ‘విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం లేదా రికార్డింగ్ చేసే పరికరాలు అధికారులు వవద్ద ఉన్నదీ, లేనిదీ మాకు తెలియదు’అని స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పిటిషనర్ తరఫున కోర్టుకు హాజరయ్యారు. విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఇబ్బందులున్న పక్షంలోకనీసం రికార్డు చేసేలా చూడాలని సింగ్ సూచించారు. గోవిందాచార్య పిటిషన్‌ను ఇప్పుటికిప్పుడు విచారించాల్సిన అవసరం లేదన్న బెంచ్ ఇది ‘వ్యవస్థాపరమైంది’గా పేర్కొంది. అలాగే పాలనాపరమైందిగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజ్యాం గ, జాతీయ ప్రయోజనాలుంటే కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారాలు చేయవచ్చని 2018 సెప్టెంబర్ 26న సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని పిటిషనర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయోధ్య అంశం ప్రాధాన్యతగలదేనని, ఏం జరుగుతుంది తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజలకు ఉంటుందని గోవిందాచార్య అన్నారు.