క్రైమ్/లీగల్

వాహనాల చోరీ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, ఆగస్టు 5: సులభంగా డబ్బులు సంపాదించాలని పార్కింగ్ చేసిన వాహనాలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న ముఠా సభ్యులను అరెస్టుచేసి వారి వద్ద నుండి 28 లక్షల 70 వేల రూపాయలు విలువ చేసే 55 బైకులు స్వాధీనం చేసుకున్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. సోమవారం నేరేడ్‌మెట్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. అబ్ధులాపూర్‌మేట్ అన్నారం కాలనీలో నివసించే మర్రి నాగరాజు అలియాస్ రాజు(27), ఉప్పల్ పరిధిలో నివసించే అల్లూరి విజయ్ అలియాస్ బాచీ(26), మద్దం రాజు అలియాస్ బాబీ(33), కొమ్మగల మహేష్(28), చిత్తరంజన్ రెడ్డి(61), శివకృష్ణ (26) ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలు, సుపారీలు తీసుకొని సెటిల్‌మెంట్‌లు చేస్తున్నట్టు సీపీ తెలిపారు. మూడేళ్లుగా రాచకొండ, హైదారాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బైకు దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు. ఉప్పల్‌లోని స్థలంను సెటిల్‌మెంట్ చేసినట్టు తెలిపారు. ఎల్‌బినగర్ సీసీఎస్ పోలీసులు ఆదివారం వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్‌లో అనుమానస్పదంగా తిరుగుతున్న నాగరాజుని పట్టుకుని విచారించగా అసలు విషయం చెప్పినట్టు సీపీ తెలిపారు. వెంటనే ముఠా సభ్యులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి రెండు బొమ్మ తుపాకులు, రెండు తల్వార్‌లు, స్థలానికి సంబంధించిన పత్రాలు, బైకులు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు.