క్రైమ్/లీగల్

మిస్టరీగా బాలిక కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 5: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మైనర్ బాలిక కిడ్నాప్ మిస్టరీగా మారింది. సదరు మైనర్ బాలిక కిడ్నాప్ అయి నెలన్నర రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కిడ్నాపర్ ఆచూకీ లభ్యం కాలేదు. ప్రత్యేక పోలీసు బృందాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముమ్మరంగా కిడ్నాపర్ కోసం గాలిస్తున్నా ఫలితం లేకపోయింది. దీంతో సోమవారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంధ్రనాధ్ బాబు కిడ్నాప్ ఉదంతంపై స్పందించారు. కిడ్నాపర్ ఆచూకీ తెలిపిన వారికి రూ.25వేలు నజరానా ప్రకటించారు. అసలు ఈ కిడ్నాప్ ఉదంతానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత జూన్ నెల 24వతేదీన చిలకలపూడి పోలీసు స్టేషన్‌లో ఓ మైనర్ బాలిక అదృశ్యమైనట్టు కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికకు దగ్గర బంధువైన గుంటూరు జిల్లా చెరుకుపల్లి గ్రామానికి చెందిన పీతా జగదీష్ బాబు అనే యువకుడు ప్రేమ పేరుతో ఆ బాలికను ఇంటి నుండి తీసుకువెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గడిచిన నెలన్నర రోజులుగా కిడ్నాపర్ కోసం విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నారు. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కిడ్నాపర్ జగదీష్ బాబు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు. ఒక్క కృష్ణాజిల్లాలోనే కాకుండా నిందితుడి జిల్లా అయిన గుంటూరు జిల్లాలో కూడా అక్కడి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినా ఆచూకీ లభించకపోవటంతో సోమవారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రవీంద్రనాధ్ బాబు కిడ్నాపర్‌ను పట్టిస్తే రూ.25వేలు నజరానా అందిస్తామని మీడియా ద్వారా తెలియచేశారు. ఇప్పటి వరకు బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా కేసు విచారణ చేపట్టారని ఇకపై అడిషనల్ ఎస్పీ ఎం సత్తిబాబు కేసుకు సంబంధించి పర్యవేక్షణాధికారిగా ఉంటారని ఎస్పీ తెలిపారు. కిడ్నాపర్ వివరాలు తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కిడ్నాపర్ సమాచారాన్ని 9440796405 నెంబరుకు తెలియచేయాలని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు కోరారు.