క్రైమ్/లీగల్

గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 12:ఒంగోలులో విషాదం చోటు చేసుకుంది. స్థానిక మంగమూరురోడ్డులోని కొత్తడొంకలో పిల్లలు ఆడుకుంటుండగా గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతిచెందిన సంఘటన గురువారం మధ్యాహ్నం 12.30గంటలనుండి ఒంటిగంట ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటన హృదయవిదారకంగా మారింది. మృతిచెందిన వారిలో గుడిమిట్ల నవదీప్(7), సిందే ప్రేమ్‌చంద్ (7), కట్టా మణికంఠ (7)లుగా గుర్తించారు. మరో ఐదేళ్ళ సిందే ప్రేమజ్యోతి అనే బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానిక కొత్తడొంకలో నూతనంగా నిర్మించిన ప్రహరిగోడకు అమర్చిన గేటును పట్టుకుని చిన్నారులు ఆడుకుంటుండగా గేటు విరిగి చిన్నారులపై పడింది. దీంతో నవదీప్ అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రేమ్‌చంద్,మణికంఠ,ప్రేమ అనే ముగ్గురు చిన్నారులకు తీవ్రగాయాలు కావటంతో ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. వీరిలో చికిత్సపొందుతూ ప్రేమ్‌చంద్, మణికంఠ అనే బాలురు మృతిచెందారు. తీవ్రగాయాలపాలైన బాలిక ప్రేమకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతులందరూ చిన్నారులు కావటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో మంగమూరురోడ్డులోని కొత్తడొంకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాము ఇంటిలో ఉండగా ఒక్కసారిగా పెద్దగా శబ్ధం వచ్చిందని, బయటకు వచ్చి చూస్తే కొత్తగా కట్టిన ఇంటి గోడ కూలి ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయని గుర్తించామని స్థానికులు చెబుతున్నారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు గోడకింద పడి ఉన్న నలుగురు చిన్నారులను బయటకు తీశారు. వీరిలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురిని రిమ్స్ వైద్య శాలకు తరలించారు. వారిలో ఇద్దరు మృతిచెందగా ప్రేమకు రిమ్స్‌వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గోడకూలీ ముగ్గురు చనిపోయారన్న వార్తతెలిసిన వెంటనే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా సంఘటనకు కారణమైన ఇల్లు ఎవరిదో తెలుసుకుని యజమాని నిర్లక్ష్యంపై విచారణ జరిపిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తెలిపారు. సంఘటన స్థలాన్ని ఒంగోలు తాలుకా సీఐ గంగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చిన్నారుల తల్లిదండ్రులు కూలీనాలి చేసుకుని జీవిస్తున్నారు. మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి.