క్రైమ్/లీగల్

బట్టందొడ్డి-గద్దూరు మలుపువద్ద ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపంజాణి, ఏప్రిల్ 12: ఆర్టీసీ మెట్రోబస్సు, కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన గురువారం చిత్తూరుజిల్లా పెద్దపంజాణి మండలం మదనపల్లె-చిత్తూరు జాతీయరహదారి బట్టందొడ్డి-గద్దూరు మలుపువద్ద చోటుచేసుకుంది. పెద్దపంజాణి ఎస్‌ఐ చంద్రమోహన్ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి... పుంగనూరు పట్టణం తూర్పు మొగసాలకు చెందిన నరసింహులు, అనితలకు కుమారుడు నవీన్(26), కుమార్తె నవ్య సంతానం. కుమార్తె నవ్యను తిరుపతికి చెందిన సునీల్‌తో వివాహమైంది. వీరికి హర్షిత్ అనే ఆరేళ్ళ కుమారుడు సంతానం. కుమార్తె, అల్లుడు కలసి చిత్తూరు పట్టణంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. గురువారం ఆ ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కుమార్తె నవ్య, అల్లుడు సునీల్, మనవడు హర్షిత్(6)లు చిత్తూరుకు వచ్చారు. ఇందుకు పుంగనూరు నుంచి అనిత(50), అనిత నరసింహులు ఇంటి స్నేహితుడు రిటైర్డ్ మున్సిపల్ డిఇ దొరస్వామి(60), అనిత, కుమారుడు నవీన్(26)లు కలసి కారులో చిత్తూరుకు వెళ్ళారు. ఇంటి కొనుగోలుకు రిజిస్ట్రేషన్ ముగించుకుని కుమార్తె, అల్లుడు అటే తిరుపతికి బయలుదేరి వెళ్ళారు. మనవడు హర్షిత్, అనిత, నవీన్, దొరస్వామిలు కారులో చిత్తూరు నుంచి పుంగనూరుకు బయలుదేరారు. మార్గమధ్యలోని పెద్దపంజాణి మండలం బట్టందొడ్డి పంచాయతీ రామాపురం గ్రామం గద్దూరు మలుపువద్ద మదనపల్లె నుంచి చిత్తూరుకు వెళ్తున్న ఆర్టీసి మెట్రోబస్సు ఢీకొంది. కారు నుజ్జునుజ్జు కాగా, కారులో ముందుబాగంలో డ్రైవింగ్ చేస్తున్న నవీన్(26), ముందుసీట్లో కూర్చోని ఉన్న హర్షిత్(6) అక్కడికక్కడే మృతిచెందారు. వెనుకసీట్లో కూర్చోని ఉన్న అనిత(50), రిటైర్డ్ డిఇ దొరస్వామి(60)లు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి స్విమ్స్‌కు రెఫర్ చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పెద్దపంజాణి ఎస్‌ఐ చంద్రమోహన్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, ప్రమాదానికి కారణమైన మెట్రోబస్సును సీజ్‌చేసి పెద్దపంజాణి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.