క్రైమ్/లీగల్

అత్యాచారం చేసిన నిందితుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, ఏప్రిల్ 12: రుద్రంగి మండలం మానాల గ్రామంలో వీరునితండాలో గత నాలుగు రోజుల క్రితం 27 సంవత్సరాల వివాహితపై అత్యాచారం చేసిన బానోతు మదన్, కున్సోత్ లక్‌పతిలను గురువారం రాత్రి సిఐ విజయ్ కుమార్ అరెస్ట్ చేశారు. వివరాలను ఆయన వెల్లడించారు. ఇంటిలో ఎవరు లేని సమయంలో వివాహిత నోట్లో గుడ్డలు కుక్కి సమీప అటవీప్రాంతానికి తీసుకవెళ్లి అత్యాచారం చేసినట్లు సిఐ తెలిపారు. మంగళవారం రాత్రి ఆమె తండ్రి శంకర్, తల్లి గౌరవ్వలు రుద్రంగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపగా నిందితులను మరిమడ్ల, మానాల అటవీ ప్రాంతంలో పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. వీరి వద్ద ద్విచక్ర వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ విద్యాసాగర్, కానిస్టేబుళ్లు కుమార్ పాల్గొన్నారు.