క్రైమ్/లీగల్

మెడికల్ కౌనె్సలింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాల కొనసాగింపునకు హైకోర్టు సోమవారం నాడు పచ్చజెండా ఊపింది. ఇంత వరకూ జరిగిన మొదటి, రెండో
విడతల సందర్భంగా 2487 సీట్లకు కౌనె్సలింగ్ జరిగింది. వర్శిటీ ఓపెన్ కేటగిరిలో 1244 మందికి, రిజర్వేషన్ కేటగిరిలో 1243 మందికి సీట్లు కేటాయించింది. మొదటి కౌనె్సలింగ్‌లో ఓపెన్ కేటగిరిలో చేరిన ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో మంచి కాలేజీ కోసం రెండో కౌనె్సలింగ్ కోసం ఎదురుచూశారు. దాంతో వారి సీట్లను తిరిగి ఆయా వర్గాలకే కేటాయించినట్టు వర్శిటీ వర్గాలు చెబుతున్నాయి. కానీ జీవో 550 ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదని ఫలితంగా దాదాపు 40 సీట్లను రిజర్వుడ్ వర్గాలు నష్టపోయారని ఆయా వర్గాలు ఆరోపించాయి. రెండు విడతల కౌనె్సలింగ్ అనంతరం కన్వీనర్ కోటా లో ఇంకా 160 ఎంబీబీఎస్ సీట్లు మిగిలాయి. వాటితో పాటు జాతీయ కోటాలో మిగిలిపోయి, రాష్ట్రానికి బదిలీ అయిన 67 సీట్లు, అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 190 సీట్లకు మూడో విడత కౌనె్సలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై కొంత మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. సీట్ల కేటాయింపులో తొలుత రిజర్వేషన్ కోటా సీట్లను భర్తీ చేసిన తర్వాతనే ఓపెన్ కేటగిరి సీట్లను భర్తీ చేస్తున్నారని, దీనివల్ల తమకు అన్యాయం జరుగుతోందని విద్యార్థులు పిటిషన్‌లో ఆరోపించారు. ముందుగా ఓపెన్ కేటగిరి సీట్లను భర్తీ చేసిన తర్వాతనే రిజర్వేషన్ సీట్లను భర్తీ చేయాలని వారు కోరారు. నియామక ప్రక్రియను నిర్వహిస్తున్న కాళోజీ విశ్వవిద్యాలయం నిబంధనలను పాటించడం లేదని వారు పేర్కొన్నారు. దీనిపై గతంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండో విడత కౌనె్సలింగ్‌పై స్టే విధించింది. తాజాగా పిటిషన్‌ను విచారణ చేపట్టిన న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించింది. కాళోజీ విశ్వవిద్యాలయం వాదనలను విన్న న్యాయస్థానం తాము కౌనె్సలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 నుండి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. దీంతో రెండో విడత ప్రక్రియకు మార్గం సుగమం అయింది. త్వరలోనే కాళోజీ వర్శిటీ అధికారులు కౌనె్సలింగ్‌కు సంబంధించిన రీషెడ్యూలును విడుదల చేయనున్నారు.