క్రైమ్/లీగల్

మల్లన్నసాగర్ కేసులో ఆర్డీవో, ఎమ్మార్వోకు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : కోర్టు ధిక్కారణ కింద ఇద్దరు రెవిన్యూ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, కొండపాక తహసీల్దార్ ప్రభుకు హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఇద్దరూ చెరో రెండు వేల రూపాయిలు చొప్పున జరిమానా కూడా చెల్లించాలని పేర్కొంది. పరిహారం చెల్లించకుండానే మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినా, ఆ ఆదేశాలను ఉల్లంఘించినందుకు కోర్టు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం నాడు తీర్పు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ జలాశయ నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలో భూ సేకరణ చేపట్టింది. సాగర్ పరిధిలోకి వచ్చిన ప్రజ్ఞాపూర్ మండలంలోని తుప్పారం ప్రాంతానికి చెందిన భూములను కూడా రెవిన్యూ అధికారులు సేకరించారు. అయితే ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ ముగ్గురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తగిన పరిహారం చెల్లించకుండానే భూములను స్వాధీనం చేసుకుంటున్నారని , చట్టవిరుద్ధంగా చేపట్టిన ఈ ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని వారు కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం బాధితులకు సరైన పరిహారం చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టు పనులు చేపట్టాలని మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు విచారణ పూర్తయ్యే వరకూ అమలులో ఉంటాయని కూడా పేర్కొంది. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి రాత్రికి రాత్రి తమ భూములను స్వాధీనం చేసుకున్నారని పేర్కొంటూ ఆ ముగ్గురూ తిరిగి హైకోర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కార పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు అధికారుల తీరును దుయ్యబట్టింది. జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ జైలు శిక్షపై అప్పీలుకు వారికి అవకాశం కల్పించింది.