క్రైమ్/లీగల్

నో ఎంట్రీ సమయంలో.. వచ్చిన వాహనాలపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: నో ఎంట్రీ సమయంలో నగరంలోకి ప్రవేశించిన భారీ వాహనాలపై ట్రాఫిక్ అధికారులు దృష్టి సారించి జరిమానాలు విధిస్తున్నారు. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. భారీ వాహనాలు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకే నగరంలోకి ప్రవేశించాల్సి ఉంది. నో ఎంట్రీ సమయంలో నగరంలోకి ప్రవేశించిన వాహనాలపై 2017లో 33861 వాహనాలు, 2018లో 50410 వాహనాలు, ఈ ఏడాది ఇప్పటి వరకు 49156 వాహనాలపై కేసులు నమోదు చేశారు. నో ఎంట్రీ సమయంలో భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ఉంటే పది శాతం ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు భావిస్తున్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు డ్రంకన్ డ్రైవ్‌లు ముమ్మరంగా నిర్వహిస్తూ అనేక మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు.