క్రైమ్/లీగల్

జడ్పీ ఉన్నత పాఠశాలలో మందు, విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 23: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రాత్రి కొంతమంది మందు సేవించి విందు చేసుకున్నారు. పాఠశాల ఆవరణలో మద్యం బాటిళ్లు, గ్లాసులు, విస్తరాకులు పడి ఉండటంతో కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒన్‌టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.సదానాగరాజు శుక్రవారం పాఠశాలను సందర్శించారు. వివరాలు సేకరించారు. సుమారు 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా తాళ్లగడ్డకు చెందిన మాజీ కౌన్సిలర్లు బీ.లక్ష్మినారాయణ, జీ.దుర్గాప్రసాద్, బీ.సైదులు, ఎం.నిరంజన్ మరి కొంతమందితో కలిసి రాత్రి పాఠశాలలో జల్సా చేశారని ఆ ప్రాంతానికి చెందిన ఎం.సువర్ణ, సక్కుబాయి, లక్ష్మి, వై.సైదయ్య, ఖలీల్, రాము, మహేష్, జాని, నారాయణలుఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా కొందరు మందు బాటిళ్లు, విస్త్తరాకులు కావాలని అక్కడ పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని, ఫిర్యాదులు చేస్తున్నారని మాజీ కౌన్సిలర్లు లక్ష్మినారాయణ, దుర్గాప్రసాద్ ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తం మీద ఆ ప్రాంతంలో ఒకరంటే మరొకరికి గిట్టని రెండు వర్గాల వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.