క్రైమ్/లీగల్

గిరిజన యువతి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ: విశాఖ ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయ పట్టణ సమీపంలో గిరిజన వివాహిత యువతి శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యింది. గుర్తుతెలియని దుండగులు ఈ యువతిని హత్య చేసేముందు వివస్తన్రు చేసి అత్యాచారానికి పాల్పడినట్టుగా అనుమానాలు వ్యక్తవౌతున్నాయి. విశాఖ గిరిజన ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అరకులోయ పట్టణానికి ఆనుకుని ఉన్న శారద నికేతన్ పాఠశాల మీదుగా చినలబుడు గ్రామానికి వెళ్లే మార్గంలో గిరిజన వివాహిత యువతి కిల్లో పుష్పలత (20)ను శుక్రవారం రాత్రి దారుణంగా హత్య చేసారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగుచూడడంతో ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. చినలబుడు గ్రామానికి చెందిన పుష్పలత స్థానిక మీ సేవా కేంద్రంలో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. చినలబుడు గ్రామం నుంచి రోజూ అరకులోయ పట్టణానికి వచ్చి మీ సేవ కేంద్రంలో పనిచేసుకుంటూ సాయంత్రానికి తన ఇంటికి వెళుతూ ఉంటుంది. సాయంత్రం వరకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయే పుష్పలత రాత్రి వేళలో హత్యకు గురికావడం
మిస్టరీగా మారింది. శారదా నికేతన్ పాఠశాల సమీపంలో ఈ యువతి మృతదేహం పడి ఉండడడమే కాకుండా మృతురాలి శరీరంపై వస్త్రాలు లేకపోవడాన్ని శనివారం ఉదయం చూసిన కొందరు చూసి మృతదేహంపై వస్త్రాలు కప్పి ఆమె బంధువులకు సమాచారం అందించారు. వివస్తన్రు చేసి హత్య చేయడాన్ని బట్టి దుండంగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టుగా భావిస్తున్నారు. పుష్పలతపై అత్యాచారం చేసిన అనంతరం ముఖం, తల భాగాలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న అరకులోయ పోలీసులు శనివారం ఉదయం హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక విచారణ చేపట్టారు. అయితే యువతిని ఎవరు, ఎందుకు హత్య చేశారన్నది తెలియరానప్పటికీ ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తవౌతున్నాయి. హతురాలి భర్త మహేష్‌కు గతంలోనే వేరే గిరిజనేతర యువతితో వివాహం జరిగిందని, పుష్పలతను రెండో భార్యగా వివాహం చేసుకున్నట్టు చెబుతున్నారు. దీంతో మహేష్ మొదటి భార్యకు చెందిన బంధువులే ఈ హత్యకు పాల్పడినట్టుగా అనుమానాలు వ్యక్తవౌతుండడంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తును చేపట్టారు. ఈ మేరకు మృతురాలి భర్త మహేష్‌తో పాటు ఆయన మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ శనివారం సాయంత్రం అరకులోయ చేరుకుని హత్య సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా హత్యకు గురైన పుష్పలత మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై అరకులోయ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.పైడయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రాలు.. పుష్పలత మృతదేహం, సంఘటన స్థలంలో విచారిస్తున్న పోలీసులు