క్రైమ్/లీగల్

కోడెలపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదైంది. అసెంబ్లీకి చెందిన ఫర్నిచర్‌ను తన కార్యాలయానికి, తన కుమారుడు శివరామ్ నిర్వహిస్తున్న షోరూమ్‌కు తరలించారని ఆయనపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కోడెలపై అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అసెంబ్లీ అధికారులు కోడెల క్యాంప్ కార్యాలయం, గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్‌లో అసెంబ్లీ ఫర్నిచర్‌ను గుర్తించారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇళ్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్నందుకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే తనదికాని ప్రభుత్వ ఆస్తిని షోరూమ్‌లో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.