క్రైమ్/లీగల్

ట్యాంకర్ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఆగస్టు 25: అదుపుతప్పి ట్యాంకర్ బోల్తా పడటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ సంఘటన ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న సిమెంట్ లోడ్‌తో ఉన్న ట్యాంకర్ లారీ వికారాబాద్-హైదరాబాద్ రైల్వే బ్రిడ్జీపై అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్, కినె్నరుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లాలన్నా.. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు రావాలన్ని ఏకైక మార్గం బ్రిడ్జీ మార్గమే కావడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్థంభించింది. సీఐ శ్రీనివాస్‌రావు, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ సంఘన స్థలాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా బోల్తాపడిన లారీని తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.