క్రైమ్/లీగల్

30 వరకూ సీబీఐ కస్టడీలోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థిక మంత్రి కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరాన్ని మరో నాలుగు రోజుల పాటు కస్టడీలోనే ఉంచి విచారించాలని ఢిల్లీ కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల 30 వరకు ఆయన్ను కస్టడీలోనే ఉంచాలని ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ ఉత్తర్వు జారీ చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలను వెలుగులోకి తేవాలంటే మరి కొన్ని రోజుల పాటు చిదంబరాన్ని తమ కస్టడీలో ఉంచాలన్న సీబీఐ డిమాండ్ సమర్థనీయమేనని ఆయన అన్నారు. దర్యాప్తు అన్నది అధికారుల ప్రత్యేక విశేషాధికారమని అయితే ఇది చట్ట పరిథిలోనే జరగాలని న్యాయమూర్తి తెలిపారు. తాజాగా సీబీఐ చేసిన వాదనను బట్టి చూస్తే ఈ నెల 30 వరకు చిదంబరాన్ని కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే ఈ తదుపరి కస్టడీ కాల వ్యవథిలో రోజుకు అరగంట పాటు చిదంబరాన్ని కలుసుకునేందుకు ఆయన లాయర్లను, కుటుంబ సభ్యులను న్యాయమూర్తి అనుమతించారు.
నాలుగు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో చిదంబరాన్ని సోమవారం కోర్టుకు తీసుకుని వచ్చారు. కొన్ని ఈమెయిళ్ళతో పాటు ఈ అవినీతి కుట్రను వెలుగులోకి తేవలాంటే ఈ ఆర్థిక మాజీ మంత్రిని మరింతగా ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ కోర్టుకు స్పష్టం చేశారు. చిదంబరాన్ని కస్టడీలోనే ఉంచి తదుపరి విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కేసులో నిందితుల మధ్య జరిగిన ఈమెయిల్స్ సంభాషణలు కూడా వారు నివేదించారు.