క్రైమ్/లీగల్

వివాహిత దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26: వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి సీఐ గురవారెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామ సమీపంలోని చెరువు కట్టకింద గుర్తు తెలియని వివాహిత మృతదేహాన్ని స్థానిక రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మహిళను మండల పరిధిలోని గున్‌గల్ గ్రామానికి చెందిన బుర్క శారదగా పోలీసులు గుర్తించారు. మృతురాలు ఇబ్రహీంపట్నంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో కూలీగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌టీం, డాగ్ స్వ్కాడ్‌లతో పరిశీలించారు. గున్‌గల్ నుంచి ఆదివారం ఇబ్రహీంపట్నంకు వచ్చి ఇలా మృతదేహమై తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.