క్రైమ్/లీగల్

సైకో ఇండ్ల సూరిబాబు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవూరు, ఏప్రిల్ 13: మహిళలపై అత్యాచారాలు, దాడులు చేస్తూ జనాల కంటి మీద కునుకు లేకుండా చేసిన సైకోను ఎట్టకేలకు కోవూరు పోలీసులు గురువారం సాయంత్రం కోవూరు నాగులకట్టలోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం కోవూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రూరల్ డీ ఎస్పీ వెంకట రాఘవరెడ్డి సైకో సూరిబాబు (42)ను అరెస్ట్ చూపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సైకోగా పేర్కొంటున్న సూరిబాబు పాత నేరస్థుడని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇప్పటి వరకు 51 కేసులలో నిందితుడని, కొన్ని కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడని తెలిపారు. నిందితుడు ప్రధానంగా ఒంటరిగా ఉన్న వృద్థ మహిళలను టార్గెట్ చేస్తాడని, వారిని అత్యాచారం చేసి దొరికినకాడికి దోచుకుని పోతాడన్నారు. గత నెల మార్చి 1న రాత్రి 10గంటల ప్రాంతంలో కోవూరుల మంగళ వీధిలో ఒక మహిళపై దాడి చేసి అత్యాచారం చేశాడని, తదుపరి లైబ్రరీ సెంటర్ చావడి వీధిలో టిఫిన్ అంగడి నిర్వహించే వృద్థురాలిపై దాడి చేసి ఆమెను గాయపరచి ఆమె వద్ద ఉన్న రూ.400 లాక్కొని పారిపోయాడని తెలిపారు. అదేరోజు తెల్లవాఝామున దేసూరు వారి వీధిలో నివాసముంటున్న కోటేశ్వరరావు ఇంట్లో ప్రవేశించి వారిపై దాడి చేసి బీరువాలో ఉన్న రూ.6వేలు నగదు 2జతల వెండి కాళ్లపట్టి గొలుసులు దొంగలించాడని చివరగా పూనూరు వారి వీధిలో మొగ్గు వేస్తున్న మహిళపై దాడి చేసే ప్రయత్నం చేయగా గమనించిన స్థానికులు సైకోను ప్రతిఘటించి పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయాడని డీ ఎస్పీ వివరించారు. 2014లో చల్లా అంకమ్మ అనే మహిళను జొన్నవాడలో హత్య చేసి చెవులకు ఉన్న కమ్మలను తీసుకొని పారిపోయిన కేసులో కూడా సూరిబాబును నిందితునిగా గుర్తించామన్నారు. కోవూరులో సంచలనం రేపిన ఘటన అనంతరం జిల్లాలో పలు చోట్ల ప్రజలు సైకోగా భావించి పలువురిపై దాడి చేశారని కాని వరందరూ మతి స్థిమితం లేనివారిగా నిర్థారణ అయిందన్నారు. జిల్లా ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు కోవూరు సీ ఐ వెంకటేశ్వరరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి నిందితుని కోసం జల్లెడ పట్టామన్నారు. ఇలాంటి పోలికలు ఉన్న కేసులను పోల్చి చూసుకుని సూరిబాబే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని అంచనాకి వచ్చి అతనిపై నిఘా ఉంచామని ఎట్టకేలకు గురువారం సాయంత్రం అరెస్ట్ చేశామని తెలిపారు. సూరిబాబును పట్టుకునే క్రమంలో విశేష ప్రతిభ చూపిన కోవూరు ఎస్ ఐ అళహరి వెంకట్రావ్, సంగం ఎస్ ఐ వేణు, సిబ్బందికి ఎస్పీ చేతులు మీదుగా రివార్డులు కూడా అందిస్తామని తెలిపారు.