క్రైమ్/లీగల్

ఉన్మాదంతో యువతి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుబల్లి: ప్రేయసిపై అనుమానం పెంచుకున్న ఒక యువకుడు ఉన్మాదంతో ఆమె ప్రాణాలు తీసిన దారుణం ఖమ్మం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుబల్లి మండల పరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన కావటి తేజశ్రీ (20), సత్తుపల్లి పట్టణం ద్వారకానగర్‌కు చెందిన బుంగా నితిన్ మూడేళ్ల క్రితం కుప్పెనకుంట్ల ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమోలో చేరారు. ఒకే తరగతిలో చేరుకుంటున్న వీరి పరిచయం ప్రేమగా మారింది. గత ఏడాది వీరి డిప్లొమా పూర్తయింది. తేజశ్రీ ఫెయిలవటంతో ఇంటివద్దనే ఉంటుండగా నితిన్ ఖమ్మం లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి చదువుకుంటున్నాడు. ఫోను ద్వారా మాట్లాడుకుంటుండేవారు. ఇటీవల కాలంలో తనతో ఫోన్‌లో సక్రమంగా మాట్లాడటం లేదని తేజశ్రీపై నితిన్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో గత ఆదివారం ఖమ్మం నుండి సత్తుపల్లి వచ్చిన నితిన్ అక్కడి నుండి ఓ ద్విచక్రవాహనంపై కుప్పెనకుంట్ల వచ్చాడు. ఆదివారం సాయంత్రం తేజశ్రీని కలిసి నీతో మాట్లాడే పనుందంటూ ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని లంకపల్లి గ్రామానికి తీసుకొచ్చాడు. మార్గమధ్యలో రోడ్డు పక్కనే ద్విచక్ర వాహనాన్ని వదిలేసి లంకపల్లి సమీపంలో గల గుట్టపక్కకు చేరుకున్నారు. అక్కడ ఇరువురి మద్య వాగ్వావాదం జరగటంతో ఉన్మాదిలా మారిన నితిన్ తన వద్ద నున్న చేతి రుమాలును తేజశ్రీ మెడ చుట్టూ బిగించి హత్య చేసి ఖమ్మం పారిపోయాడు. తన కుమార్తె ఎంత సేపటికీ ఇంటికి రాకపోవటంతో తేజశ్రీ తండ్రి ఆదివారం రాత్రి వీఎం బంజర్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడు నితిన్‌ని పట్టుకొని విచారించగా తేజశ్రీని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృత దేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న కల్లూరు ఏసీపీ వెంకటేష్ సంఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
చిత్రాలు.. తేజశ్రీ మృతదేహం
*నిందితుడు నితిన్, *తేజశ్రీ ( ఫైల్‌ఫొటోలు)