క్రైమ్/లీగల్

బంజారాహిల్స్‌లో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : వీవీఐపీలు నివాసముండే బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. కోటి రూపాయల విలువ కలిగిన అభరణాలు అపహరణకు గురయనట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కాంగ్రెస్ మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి బంధువు ఉత్తమ్‌రెడ్డి బంజారాహిల్స్‌లో రోడ్ నెంబర్2లో నివాసం ఉంటారు. సోమవారం అర్ధరాత్రి సుమారు 2:30 ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయన ఇంట్లోకి ప్రవేశించి ఆభరణాలను దొంగిలించి పారిపోయాడు. ఇంటికి కాపలాగా ఉన్న సెక్యూరిటీ గాఢ నిద్రలో ఉండగా దొంగ తన పని చేసుకొని వెళ్లిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటికి సమీపంలోని సీసీ కెమెరాలను బంజారాహిల్స్ డిఐ రవి కుమార్ ఆధ్వర్యంలో పరిశీలిస్తున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.