క్రైమ్/లీగల్

మహిళ అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, ఆగస్టు 27: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా శంకరంపేట ప్రాంతానికి చెందిన సంతోష్, దక్షిత (20) దంపతులు. జీవనోపాధి కోసం బాలానగర్ పారిశ్రామిక వాడలోని కల్యాణినగర్‌లో నివాసం ఉంటున్నారు. భర్త సంతోష్ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తుండగా దక్షిత ఇంల్లోనే ఉంటున్న భార్య దక్షిత పని మీద బయటకు వెళ్లి తిరిగి రాలేదు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన సంతోష్‌కు తన భార్య కనిపించలేదు. దీంతో బంధువులు, స్నేహితులను విచారించిన ఆచూకి లభించలేదు. భర్త మంగళవారం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ రవికిరణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రౌడీ షీటర్ బైండోవర్
ఉప్పల్, ఆగస్టు 27: గణేష్ చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల ప్రకారం మేడిపల్లి పీఎస్ పరిధిలోని రౌడీ షీటర్లులను బైండోవర్ చేస్తున్నారు. ఈ క్రమంలో బోడుప్పల్‌కు చెందిన రౌడీ షీటర్ ఎల్లగోని ఉదయ్ భాస్కర్ గౌడ్‌ను మంగళవారం మెజిస్ట్రేట్ ఎదుట బైండోవర్ చేయించినట్లు ఎస్‌ఐ రఘురామ్ తెలిపారు.