క్రైమ్/లీగల్

నిలోఫర్‌లో డాక్టర్‌పై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, ఆగస్టు 27: చికిత్స కోసం వచ్చిన రోగి బంధువులు డాక్టర్‌పై దాడి చేసిన సంఘటన నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో
జరిగింది. ఇన్‌స్పెక్టర్ పాషా కథనం ప్రకారం నగరానికి చెందిన మహికే బేగం (11) నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొదుతుంది. మహికేబేగం బంధువులు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నస్రీన్ బేగం (27)తో పాటు అదిల్ (22)లు ఆసుపత్రిలో ఉన్నారు. సస్రీన్ బేగం బ్యాగ్‌ను రోగి బెడ్‌పై పెట్టడంతో ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రత్యూషా బెడ్‌పై ఉన్న బ్యాగ్‌ను కిందపడేసింది. వెంటనే నస్రీన్ బేగం డాక్టర్‌పై కోపగించుకుంది. ఈ క్రమంలో డాక్టర్ ప్రత్యూషా, బేగం మధ్య మాటలు పెరిగి తోపులాట జరిగింది. ఈ తోపులాటలో డాక్టర్ ప్రత్యూషపై చేయి చేసుకుంది. నస్రీం బేగం. ఈ దాడిలో బేగంతో పాటు తమ్ముడు అదిల్ కూడా దాడి చేసినట్లు డాక్టర్ ప్రత్యూషా నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.