క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన జిల్లా ఆసుపత్రి సేవల కో- ఆర్డినేటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఆగస్టు 27: ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్ ఫైల్ పంపేందుకు రూ. 5 వేలు లంచం తీసుకున్న కడప జిల్లా ఆసుపత్రి సేవల కో ఆర్డినేటర్ ఎంఎస్.పద్మజను మంగళవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఎం.నాగభూషణం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డీసీహెచ్‌ఎస్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్.రాధిక తనకు రావాల్సిన వార్షిక ఇంక్రిమెంట్ ఫైల్ మంజూరు చేసేందుకు జిల్లా ఆసుపత్రి సేవల కో ఆర్డినేటర్ పద్మను ఆశ్రయించారు. దీనికి ఆమె రూ.5 వేలు లంచం అడిగారు. దీంతో రాధిక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం పద్మజకు రూ.5 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు.