క్రైమ్/లీగల్

సుప్రీం ధర్మాసనానికి ఆర్టికల్-370 రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్-370ని రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లపై విచారణను అక్టోబర్ మొదటి వారంలో చేపడతామని బుధవారం తెలిపింది. రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైనందున కేంద్ర ప్రభుత్వానికి, జమ్మూకాశ్మీర్ యంత్రాంగానికీ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రస్తావించడాన్ని సుప్రీంకోర్టు ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించలేదు. ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి అప్పగించనున్నట్లు తెలిపింది. బెంచ్‌లో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌ఎ బొబ్డె, ఎస్‌ఏ నజీర్‌లు కూడా ఉన్నారు. ఇలాఉండగా రాష్టప్రతి ఉత్తర్వులను కాదని, రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎంఎల్ శర్మ తొలుత పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన మరో న్యాయవాది షకీర్ షబీర్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని ప్రముఖ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ఈ నెల 10న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. 370-అధికరణను రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోలేదని నేషనల్ కాన్ఫరెన్స్ వాదించింది. జమ్మూకాశ్మీర్, లడఖ్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించడాన్ని, దానికి వెంటనే రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడం రాజ్యాంగ వ్యతిరేకమని ఆ పిటిషన్‌లో పేర్కొంది. నేషనల్ కాన్పరెన్స్ తరఫున లోక్‌సభ సభ్యుడు మహ్మద్ అక్బర్ లోన్, విశ్రాంత న్యాయమూర్తి హస్నేన్ మసూది ఈ పిటిషన్ దాఖలు చేశారు. మహ్మద్ అక్బర్ లోన్ లోగడ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి స్పీకర్ బాధ్యతలు నిర్వహించారు. విశ్రాంత న్యాయమూర్తి మసూదీ జమ్మూకాశ్మీర్ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాజ్యాంగంలోని 370-అధికరణ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటైందని వీరు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇలాఉండగా రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ మరి కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. రక్షణ శాఖకు చెందిన పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు 370-అధికరణను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని హోం మంత్రిత్వ శాఖకు చెందిన విశ్రాంత అధికారి ప్రొఫెసర్ రాధా కుమార్, జమ్మూకాశ్మీర్ క్యాడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి హిందల్ హైదర్ త్యాబ్జి విడిగా పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా విశ్రాంత ఏయిర్ వైస్ మార్షల్ కపిల్ కక్, విశ్రాంత మేజర్ జనరల్ అశోక్ కుమార్ మెహతా, పంజాబ్ క్యాడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి అమితాభ పాండే, కేరళ క్యాడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాల్ పిళ్లై పిటిషన్లు దాఖలు చేశారు. పిళ్లై 2011లో కేంద్ర హోం కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఉన్నతాధికారి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన షా ఫైజల్, ఆయన పార్టీ సహచరులు, ఇంకా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జెఎన్‌యుఎస్‌యు) నాయకుడు షెహ్లా రషీద్ కూడా రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు.