క్రైమ్/లీగల్

స్కూల్ వ్యాన్ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ టౌన్: డ్రైవర్ మద్యం మత్తు ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలితీ సుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులోని అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు పాఠశాల విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వేములవాడ పట్టణంలోని మం డల పరిషత్ కార్యాలయానికి సమీపంలో వాగ్వేరి పాఠశాల నడుస్తోంది. విద్యార్థులను మధ్యాహ్న భోజనం చేయడానికి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో చింతలఠాణా కాలనీలో ఉన్న హాస్టల్‌కి బయలుదేరారు. 26 మంది విద్యార్థులు స్కూలు బస్సులో బయలు దేరారు. బస్సు మరో ఐదు నిమిషాల్లో హాస్టల్‌కు చేరబోతుండగా డ్రైవర్ రఫీ వేగంగా డివైడర్ ఢీకొట్టాడు. అంతే బస్సు బోల్తాపడింది. దీంతో
మానస్విని, దీక్షిత, రిషి బస్సులోంచి ఎగిరి కిందపడ్డారు. మానస్విని, దీక్షిత అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన రిషి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా విద్యార్థులకు గాయాలయ్యాయి. మద్యం మత్తులో డ్రైవర్ బస్సును నడపడం వల్లేనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్, జడ్పీ చైర్‌పర్సన్ అరుణ, ఎస్పీరాహుల్‌హెగ్డే సందర్శించారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో చికిత్స చేయస్తామని మంత్రి ఈటల రాజేందర్ హామీనిచ్చారు. పాఠశాల గుర్తింపును రద్దు చేసి, విద్యార్థులను మరో పాఠశాలకు తరలిస్తామని ఎంఈవో రాధాకిషన్ వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
పాఠశాల బస్సు ప్రమాదంలో మృతి చెందిన మానస్విని, దీక్షిత, రిషి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. తక్షణ సహాయంగా రూ.2 లక్షలను జడ్‌పీ చైర్‌పర్సన్ అరుణ మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబాలకు అందజేశారు.

చిత్రాలు.. మృతి చెందిన విద్యార్థులు, సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి ఈటల రాజేందర్