క్రైమ్/లీగల్

అది బాధ్యతారాహిత్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, ఆగస్టు 29: గోవా జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) తన బాధ్యతలను విస్మరిస్తున్నారని, ఖైదీల పెరోల్, ఫర్‌లాఫ్ దరఖాస్తుల విషయంలో మనసు పెట్టకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని బొంబాయి హైకోర్టు మండిపడింది. ఇన్‌స్పెక్టర్ జనరల్ (జైళ్లు) రాజేంద్ర మిరాజ్‌కర్ ఖైదీల పెరోల్, ఫర్‌లాఫ్ దరఖాస్తులను ‘యాంత్రిక’ ధోరణిలో తిరస్కరించారని న్యాయమూర్తులు ఎంఎస్ సోనక్, నూతన్ సర్దేశాయిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం జారీ చేసిన తన ఆదేశాలలో వ్యాఖ్యానించింది. ఉత్తర గోవా జిల్లాలోని కోల్వలే జైలులో ఉన్న నగుయేశ్ గోవంకర్ అనే ఖైదీ తనను పెరోల్‌పై విడుదల చేయించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ ధర్మాసనం.. ఐజీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది.
‘ఐజీ తన బాధ్యతలను విస్మరించారని, ‘పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) జారీ చేసిన ఆదేశాల విషయంలో తన విచక్షణను ఉపయోగించలేదని ప్రాథమిక ఆధారాలు వెల్లడిస్తున్నాయి’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పోలీసు సూపరింటెండెంట్ కూడా యాంత్రిక ధోరణిలో తన నివేదికలు రూపొందించారని మండిపడింది. గతంలో ఖైదీలను పెరోల్, ఫర్‌లాఫ్ మీద విడుదల చేశారని, అప్పుడు వారు పారిపోలేదని ధర్మాసనం పేర్కొంది. ‘ఈ వాస్తవ పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా, కేవలం ఖైదీలు పారిపోయే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్న దాని ఆధారంగా పెరోల్, ఫర్‌లాఫ్ కోసం పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించారు’ అని ధర్మాసనం తెలిపింది.