క్రైమ్/లీగల్

హైస్పీడ్ వాహనాలపై చర్యలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: తెలంగాణలో మితిమీరిన వేగంతో వాహనాలు వెళ్తున్నప్పటికీ, వేగ నియంత్రణకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రవాణా వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలు అమర్చేలా రాష్ట్ర రవాణా శాఖను ఆదేశించాలని కోరుతూ ది రైట్ సొసైటీ సంస్థ హైకోర్టులో ప్రజావాజ్య పిటిషన్ (పిల్)ను దాఖలు చేసింది. వాహనాల వేగంపై గతంలో సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా, వాటిని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయడం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు వివరించారు. ప్రమాదాలు ఎక్కువగా మితిమీరిన వేగం వల్లనే జరుగుతున్నాయని అనేక సర్వేలు తేల్చాయని ఆమె చెప్పారు. సుప్రీంకోర్టు నియమించిన రాధాకృష్ణన్ కమిటీ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రవాణా వాహనాల్లో వేగ నియంత్రణ వ్యవస్థను రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఆ దిశగా ప్రభుత్వం నేటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
డెంగ్యూపై చర్యలేవీ
రాష్ట్రంలో డెంగ్యూ నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు శుక్రవారం నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. డెంగ్యూ నివారణకు తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. కరుణ అనే వైద్యురాలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆస్పత్రులు అన్నీ జ్వరాలతో నిండిపోతున్నాయని, డెంగ్యూ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని , కొన్ని వేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆమె తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ, రాష్ట్రంలో వ్యాధుల వార్తలు పత్రికల్లో చూస్తున్నామని, అత్యవసర పరిస్థితులు తలపిస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. తక్షణం నియంత్రణ చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వం తన సమాధానాన్ని సెప్టెంబర్ 7వ తేదీలోగా సమర్పించాలని హైకోర్టు బెంచ్ ఆదేశించింది.
న్యాయవాదులతోనూ చర్చించాలి
హైకోర్టును బుద్వేలుకు తరలించాలనే యోచనలో ప్రభుత్వం ఉంటే, అందుకు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ తగిన నిర్ణయం తీసుకునే ముందు న్యాయవాదులతోనూ చర్చించాలని హైకోర్టు పరిరక్షణ సమితి కోరింది. హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీ దృష్టికి తమ అభిప్రాయాన్ని కూడా తీసుకువెళ్తామని, దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కమిటీ నేతలు పేర్కొన్నారు.