క్రైమ్/లీగల్

రేణుకా చౌదరిపై వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 30: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిపై వారెంట్ జారీ అయ్యింది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వైరా టిక్కెట్‌ను తన భర్త డాక్టర్ రాంజీకి ఇప్పిస్తానని మోసం చేశారంటూ రాంజీ భార్య కళావతి కేసు వేసింది. దీనిని కొంత కాలంగా విచారిస్తున్న ఖమ్మం రెండవ అదనపు సివిల్ జడ్జి జయమ్మ సెప్టెంబర్ 26వ తేదిన రేణుకాచౌదరి తప్పనిసరిగా హాజరుకావాలని వారెంట్ జారీ చేశారు. తన భర్తకు టిక్కెట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని ఇప్పించలేదని, దీంతో ఆయన మనస్తాపానికి గురై మరణించారని కళావతి కొంత కాలంగా కాంగ్రెస్ పెద్దలను కలుస్తూనే ఉంది. ఎన్నికల సమయంలో రేణుకాచౌదరికి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 28వ తేదిన కోర్టు వాయిదాకు ఆ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న రేణుకాచౌదరి హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి వచ్చే నెల 26వ తేదిన వాయిదాకు తప్పనిసరిగా రేణుకాచౌదరితో పాటు మిగిలిన ఆరుగురు కూడా హాజరుకావాలని వారెంట్ జారీ చేశారు. ఇదిలా ఉండగా రేణుకాచౌదరిపై వస్తున్న ఈ ఆరోపణల వెనుక కాంగ్రెస్ పెద్దలే ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఈ వివాదాన్ని లేవనెత్తుతున్నారని, ఇప్పుడు పీసీసీ అధ్యక్ష నియామకం జరుగుతున్న సమయంలో ఈ కేసు చర్చకు రావటం గమనించాలని కొందరు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.