క్రైమ్/లీగల్

మా వాటాను వదులుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలలో అలహాబాద్ హైకోర్టు తనకు కేటాయించిన మూడో వంతు వాటాను రామమందిర నిర్మాణం కోసం హిందువులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని షియా వక్ఫ్ బోర్డు శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికే హిందువుల తరపు న్యాయవాదుల వాదనలు వినడాన్ని పూర్తి చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఏ నజీర్ సభ్యులుగా ఉన్నారు. బాబర్ వద్ద కమాండర్‌గా పనిచేసిన మీర్ బకీ షియా తెగకు చెందిన వ్యక్తి అని, బాబ్రీ మసీదును నిర్మించినందున ఆయనే మసీదు తొలి ‘ముతావల్లీ’ (సంరక్షకుడు) అని షియా వక్ఫ్ బోర్డు తరపు న్యాయవాది ఎంసీ ధింగ్రా రాజ్యాంగ ధర్మాసనానికి తెలిపారు. ‘నేను హిందువుల తరపు వారిని సమర్థిస్తున్నాను’ అని ఆయన అయోధ్య స్థల వివాదం కేసు 16వ రోజు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి, మూడింట ఒక వంతు వాటాను ముస్లింలకు కేటాయించిందే తప్ప సున్నీ వక్ఫ్ బోర్డుకు కాదని ఆయన పేర్కొన్నారు. బాబ్రీ మసీదు ఒకప్పుడు షియా వక్ఫ్ బోర్డు ఆస్తి అని ఆయన తెలిపారు. అందువల్ల హైకోర్టు తనకు కేటాయించిన వాటాను హిందువులకు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. హిందువులు ఏమని వాదించారనే దాని పట్ల దురభిప్రాయం లేకుండా, వ్యితిరేకభుక్తము కారణంగా షియాలు ఆ ఆస్తిపై తమ హక్కును కోల్పోయారని ధింగ్రా తెలిపారు. 1936 వరకు బాబ్రీ మసీదు షియాల స్వాధీనంలోనే ఉందని, పైగా, దాని తొలి, తుది ముతావల్లి (సంరక్షకుడు) కూడా షియానేనని, సున్నీ తెగకు చెందిన వ్యక్తి ఎన్నడు కూడా ముతావల్లిగా నియామకం కాలేదని ధింగ్రా రాజ్యాంగ ధర్మాసనానికి తెలిపారు. అయితే, షియాలకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వివాదాస్పద ఆస్తిని సున్నీ వక్ఫ్‌కు రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. షియా వక్ఫ్ బోర్డు సున్నీ ఇమామ్‌ను నియమించిందనే స్వల్ప కారణంతో 1946లో కోర్టులో కేసులో ఓడిపోయిందని ఆయన వివరించారు. మేము దీనినంతా చూడాల్సిన అవసరం ఉందా? అని రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఆస్తిపై షియా వక్ఫ్ బోర్డుకు ఉన్న హక్కును నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను’ అని ధింగ్రా వాదించారు. ‘మీరు 70కి పైగా ఏళ్ల క్రితం నాటి తీర్పును సవాలు చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ (అప్పీల్)ను దాఖలు చేశారు’ అని ధర్మాసనం పేర్కొంది. శుక్రవారం అంతకుముందు ‘అఖిల్ భారతీయ శ్రీ రామ్ జనమ్ భూమి పునరుద్ధార్ సమితి’ తరపున సీనియర్ న్యాయవాది పీఎన్ మిశ్రా తన వాదన వినిపించారు.