క్రైమ్/లీగల్

చెరువులో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఆగస్టు 31: చెరువులో దూకి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన నాగారం మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగారం పాత గ్రామానికి చెందిన పులకుర్తి లక్ష్మమ్మ (85) శనివారం నాగారం గ్రామంలోని దాయర కుంట చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు అక్కడికి చేరుకొని చెరువులో నుండి మృతదేహాన్ని వెలికి తీసారు. మృతురాలి మృతికి కారణాలు తెలియదని అన్నారు. ఈ మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షాక్‌తో ఆవు మృతి
షాద్‌నగర్ టౌన్, ఆగస్టు 31: విద్యుత్ షాక్‌తో ఆవు మృతి చెందిన సంఘటన పాపిరెడ్డిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే రైతుకు సంబంధించిన ఆవుకు విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని, ప్రభుత్వం తనకు నష్టపరిహారం చెల్లించేందుకు కృషి చేయాలని రైతు కోరారు. విద్యుత్ వైర్లను సరిచేయాలని స్థానిక ట్రాన్స్‌కో అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని, ట్రాన్స్‌కో అధికారులు బాధ్యత వహించాలని అని అన్నారు.